*షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలను సవరించాలి*

సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు .
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుకూలంగా రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ కార్మికులకు కనీస వేతనాలు సవరించి జీ.వో.లు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నేరేడుచర్ల లోని ఆగస్టు 3 చలో హైదరాబాద్ గోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాల జీ.వో.లను విడుదల చేయవలసి ఉండగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఒక్క జీ.వో. రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన జీ.వో.లే అమలు చేస్తున్నందున రాష్ట్రంలోని కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని, తమ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 3న సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తుందని, ఈ ధర్నాలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కనీస వేతన చట్టం 1948 ప్రకారం 15వ ఐ ఎల్ సి తీర్మానం మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు, అమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని,భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో అందరినీ నమోదు చేసి నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని, కార్పొరేట్ యజమానుల కడుపు నింపి కార్మిక వర్గం కడుపు కొట్టే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్ రావు,నీలా రామ్మూర్తి,ఎస్కే ఆఫీజ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు యారవ శ్రీనివాసు,హజరత్,పెద్ద ఖజావలి,కారంగుల సత్యం, రెహమతుల్లా,మట్టయ్య,ఎస్కే సైదా, బిక్షం,తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు