సంక్రాంతికి 28 ప్రత్యేక రైళ్లు,బస్సులు
హైదరాబాద్, : సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు జనవరి 1వ తేదీ నుంచి నెల చివరివారం వరకు లింగంపల్లి -కాకినాడ టౌన్ మధ్య 28 సూపర్‌ఫాస్ట్ ఏసీ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లు బేగంపేట, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి స్టేషన్లమీదుగా కాకినాడకు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. ఈ రైళ్లలో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, 3 ఏసీ టూ టైర్, 12 ఏసీ త్రీ టైర్ కోచ్ సదుపాయాలున్నాయని పేర్కొన్నది.
సంక్రాంతికి ప్రత్యేక
సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4వేల 940 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సంక్రాంతి స్పెషల్ బస్సులను మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్, గౌలిగూడ సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సుల ను నడపనున్నారు.