సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హావిూని నెరవేర్చడంలో భాగంగా ఇండ్ల నిర్మాణం స్పీడందుకున్నాయన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలన్నారు. ఫసల్‌బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆధార్‌కార్డు నంబర్‌ ఉంటేనే రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు పొందవచ్చని తెలిపారు. దీన్‌దయాళ్‌ పథకం ద్వారా గ్రావిూణ ప్రాంతాలవారు విద్యుత్‌ విూటర్‌ కొరకు కేవలం రూ.125 చెల్లించినట్లయితే విద్యుత్‌విూటర్‌ పొందవచ్చని తెలిపారు. తాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇప్పటివరకు 99శాతం మిషన్‌భగీరథ పనులు పూర్తయినట్లు చెప్పారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామన్నారు. ఇండ్ల కేటాయింపు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇస్తామన్నారు.