సంక్షేమ పథకాలపై విమర్శించే ఆస్కారం లేదు

రైతుబందు, కళ్యాణ లక్ష్మిని ఎత్తేస్తామని చెప్పగలరా?
సొంత పథకాలు లేకుండా ప్రచారంలో విపక్షాలు
మండిపడ్డ రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు
రామగుండం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ప్రతిపక్షాల నాయకులకు ప్రచారస్త్రాలు కరువయ్యాయని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యానారయణ అన్నారు. వారికి చెప్పుకోవడానికి ఏవిూ లేక కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలంటే ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సి ఉంటుంది. అవినీతిని, లోటుపాట్లను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించాలి. ప్రస్తుతం రాజకీయ పార్టీల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించే సాహసం చేయలేక పోతున్నాయని అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న విమర్శలతో ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తోందని సోమవారం నాడిక్కడ ఎన్నికల ప్రచారంలో అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను విమర్శిస్తే రైతుల ఓట్లు దూరమవుతాయనే ఆందోళనలో ప్రతిపక్షాలున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై ఆ రోపణలు చేస్తే ఆడపడుచుల ఓట్లు దక్కవేమోనని సం దిగ్ధ పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులున్నారు. ఆసరా పింఛన్లు, అమ్మ ఒడి పథకాలపై కూడా విమర్శలు చేయలేక మిన్నకుండి పోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను విమర్శించడం మానేసి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలను ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టో కంటే భిన్నంగా ఏవిూ లేవు. దీంతో ప్రచారంలో ఓటర్లను ఆ కట్టుకోలేక చతికిల పడుతున్నాయి. ఈ అంశం అధికార పార్టీకి పూర్తిగా కలిసి వచ్చే అంశం అని, ఇక్కడే తమ విజయం ఉందన్నారు. తెలంగాణలో అమలు చేయడానికి గొప్ప కార్యక్రమాలు  ఏవీ విపక్షాలు చేపట్టలేకపోయాయని అన్నారు.   2014 సార్వత్రిక ఎన్నికల్లో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు నాలుగు విడతలుగా రైతు రుణాలను రూ.లక్ష రుణమాఫీ పూర్తి చేసింది. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను సైతం అందిస్తోంది. రైతులు పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారని భావించి సీఎం కేసీఆర్‌ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలను అందించారు. దీంతో పాటు ప్రతి రైతుకు రూ.5లక్షల బీమా ను చేయించారు. రైతు బంధు, రైతుబీమా పథకాలు టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకున్నా అమలు చేశారు. ఇవి రైతుల ఆర్థిక కష్టాలను దూరం చేస్తున్నాయి. దీంతో రైతులంతా ఈ పథకాలను స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ పథకాలను విమర్శిస్తే రైతుల ఆగ్రహానికి గురవుతామని భావించి.. ఈ పథకాలపై విమర్శలను మానేసి తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను కొనసాగిస్తామని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంతకన్నా రైతులకు మేలు చేసే విధంగా వారు ఏవిూ చెప్పలేకపోతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలను అమలు చేయకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తామని చెప్పక తప్పని పరిస్థితి వారికి ఏర్పడిందన్నారు.  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఆడ బిడ్డల తల్లిదండ్రులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టారు. మొదట్లో రూ.51వేల ఆర్థిక సాయాన్ని అం దించారు. పేద ప్రజల నుంచి ఈ పథకానికి విశేష ఆ దరణ రావడంతో తదనంతరం ఆర్థిక సాయాన్ని రూ.75,116కు పెంచారు. అయినా పెళ్లి ఖర్చులకు ఇంకా సరిపోవడం లేదన్న విషయాన్ని గుర్తించి ఆర్థిక సాయాన్ని మొత్తంగా రూ.1,00,116కు పెంచారు. రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వర్తింపజేశారు. ఈ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సాయంతో పేద కుటుంబాల వారు నిశ్చింతంగా ఉన్నారని అన్నారు. ఇది పేదలకు వరంగా నిలిచిందన్నారు. మహిళల ఓట్లు ఎక్కడ దూరమవుతాయనే భయంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా మిన్నకంటున్నాయి. అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లే వారికి రూ.30 వేలకు తక్కువ కాదు. ప్రభుత్వ దవాఖానాకు వెళ్తే సుఖ ప్రసవంతో పాటు ఆడ బిడ్డ పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తున్నాయి. వీటితో పాటు తల్లీ బిడ్డల ఆరోగ్యానికి పలు రకాల వస్తువులతో కూడిన కిట్లను అందిస్తున్నారు. ఈ పథకాలను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఆసరా పింఛన్లను వృద్ధులు, వికలాంగు లు, వితంతువులకే కాకుండా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు వర్తింపజేస్తున్నారు. వీటితో అధికార పార్టీపై పింఛనుదారుల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తుండడంతో ప్రతిపక్షాలు వాటిపై విమర్శలను కట్టిపెట్టక తప్పడం లేదన్నారు. ఇక సింగరేణి విషయంలోనూ విమర్శలకు తావు లేదన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలచింది కేవలం సిఎం కెసిరఆ/- మాత్రమేనని అన్నారు.  టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనే సింగరేణి కార్మికుల సమస్యలు సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు.  సింగరేణి సంస్థలో కారుణ్య నియామాకాల సాధ్యం కావని అందరూ అనుకున్న క్రమంలో వాటిని మెడికల్‌ బోర్డు ద్వారా అమలు చేయించిన వ్యక్తి కేసీఆర్‌ అని గుర్తుచేశారు. మెడికల్‌ బోర్డులో గతంలో కేవలం 10నుంచి 15శాతం మంది మాత్రమే అన్‌ఫిట్‌ అయి వారి వారసులకు ఉద్యోగాలు లభించేవనీ, ఇప్పుడు 80శాతానికి పైగా కార్మికులు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి వారి కొడుకు లేదా అల్లుడికి ఉద్యోగం ఇప్పిస్తున్నారని, ఇది కేసీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కలను సాకారం చేస్తూ రూ.10లక్షల బ్యాంకు రుణంపై వడ్డీని చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కార్మికులందరూ మరోమారు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.