సంక్షేమ వసతి గృహల విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలి

 ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
ధూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 23 : సంక్షేమ వసతి గృహలలోని విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులను పెంచాలని దూల్మిట్ట మండల కేంద్రంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహన్ని సందర్శించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు తెలిపారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అందవాల్సిన నెలవారీ సోపు  బిల్లులు ధరలకు అనుగుణంగా పెంచాలని, పౌష్టికాహారం,చలి రగ్గులు, రన్నింగ్ బూట్లు మరియు భోజన ప్లేట్లు సకాలంలో అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భోగి మనోహర్, ఆత్మకూరి హరికృష్ణ పాల్గొన్నారు.