సంక్షేమ హాస్టల్‌లో సోలార్ కాంతులు
ఖమ్మం, డిసెంబర్ 11 : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సోలార్ కాంతులు విరజిమ్ముతున్నాయి. జిల్లాలోని 53 సాంఘిక, సంక్షేమ వసతి గృహాలకు ఇన్వైటర్లు ఎంపిక చేసిన వసతి గృహాలకు ఎంపిక చేసిన సోలార్ విద్యుత్ దీపాలు అందాయి. ప్రతి వసతి గృహానికి విద్యుత్ దీపాలతో పాటు గ్రైడర్లు, మిక్సీలు అందించారు. ఈ సందర్భంగా వసతి గృహాలకు రంగులు వేసేందుకు రూ.20లక్షలు కేటాయించారు. రంగులు వేయడంతో వసతి గృహాలు కళకళలాడుతున్నాయి. వసతి గృహాల్లో ఉంటున్న 9,10తరగతి విద్యార్థులకు ప్రతి నెలా రూ.350 ఉపకారవేతనం, పుస్తకాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఏడాదికి ప్రభుత్వం రూ.1500లు ఇచ్చేందుకు, కొత్తగా విద్యా దివెన పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇక్కడి విద్యార్థుల పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం కనపడుతుంది.