సంక్షోభాన్ని తట్టుకొనే శక్తి భారత్‌కు ఉది

1

– ప్రధాని మోదీ

న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకులోనైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. ‘ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సహా అందరూ వివిధ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల గురించి మాట్లాడారు. కానీ భారత్‌ గురించి ఆ చర్చేలేదు. మనం ప్రత్యేకంగా నిలిచాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భారత్‌ వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ విధానాలే కారణమని అంటున్నారు’ అని మోదీ అన్నారు. స్వామి దయానంద సరస్వతి 140వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే పేదరికం, నిరక్షరాస్యత సమస్యల నుంచి బయటపడాల్సి ఉందన్నారు. ఇందుకోసం సామాజిక-ఆర్థిక రంగాల్లో పుంజుకునేందుకు ముద్ర బ్యాంకు, నైపుణ్యాభివృద్ధి తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.