సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

చింతా ప్రభాకర్ నిరంతరం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్నారు

నిరంతరం ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసే నాయకుడు చింత ప్రభాకర్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  ఆగస్టు 2 ::

చింతా ప్రభాకర్ నిరంతరం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్నారని, నిరంతరం ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసే నాయకుడు చింత ప్రభాకర్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు అన్నారు. బుధవారం

హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు  క్యాంపు కార్యాలయంలో  మంత్రి హరీష్ రావు సమక్షంలో చింతా ప్రభాకర్  అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో  సదాశివపేట కాంగ్రెస్ , బీజేపీ పార్టీల యువ నాయకులు చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి హరీష్ రావు

బీఅర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి  సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో  ముఖ్యులు.. పాలనేత్ర గౌడ్, సదాశివపేట యూత్ కాంగ్రెస్ ప్రసిడెంట్ సదాశివపేట పట్టణం , ధనుంజయ్  గౌడ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సదాశివపేట టౌన్ ఉన్నారు.

వీరితో పాటు కాంగ్రెస్ , బిజెపి పార్టీలకు చెందిన వంద మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ

సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉంటూ ,నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా ,చింతా ప్రభాకర్ నిరంతరం  సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని మంత్రి వారిని సూచించారు.

కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు.బీఆర్ఎస్ విధానం మూడు పంటలకు కరెంటు అని మంత్రి అన్నారు.

అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పా లని మంత్రి సూచించారు.

రైతు వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ ,బిజెపిలకు బుద్ధి చెప్పాలి, రైతు బాంధవుడైన కెసిఆర్ నీ మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు.

పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ

గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం , పార్టీ నాయకులను పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యే సొంత ప్రయోజనాలకే మాలాంటి యువకులను వాడుకున్నారు తప్ప మాకు ఎప్పుడు అందుబాటులో లేరని వారు వాపోయారు.

యువకులు రాజకీయంగా ఎదగాలంటే హరీష్ రావు,  చింత ప్రభాకర్ లాంటి  నాయకులతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నిరంతరం పార్టీ కోసం , ప్రజల సంక్షేమం కోసం పాటు పాటుపడుతూ అందరినీ అప్యంగా పలకరించే చింతా ప్రభాకర్ గారి లాంటి నాయకుడు మాకు అవసరం  అని వారు కొనియాడారు.

చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని వారు హామీని ఇచ్చారు.

చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చీల మల్లన్న, చింతా గోపాల్ ,పిల్లోడి విశ్వనాథం , పులిమాడి రాజు , మోబిన్ , శ్రీశైలం , పెద్ద గౌడ్ , విజెందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు , రాం రెడ్డి నర్సింలు ,మనోహర్ గౌడ్ ,చింత సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు..

తాజావార్తలు