సంచలనాల మీద సంచలనాలు ఇంకా ఎన్ని
ప్రపంచ కప్ సమరం ప్రారంభమై ఇరవై రోజులు ముగిశాయి. దాదాపు అన్ని దేశాలు సగం మ్యాచ్ లు ఆడేసాయి. రికార్డుల మోత మోగింది. పలు రికార్డులు బద్దలయ్యాయి. సంచలనాల మీద సంచలనాలు నమోదయ్యాయి. హోరా హోరీగా సాగుతున్న ఈ పోరు ఇపుడు ఉత్కంఠ దశకు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ కు చేరే జట్లు ఏవి అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
అయితే బ్యాట్కు బాల్కు జరుగుతున్న ఈ పోరులో ఇప్పటివరకు బ్యాట్స్మెన్ల హవానే కొనసాగింది. ఫోర్లు, సిక్స్ల వరద పారింది. సెంచరీల మెరుపులు మెరిశాయి. అయితే ఈ సమరంలో ఇప్పటివరకు ఎంతమంది బ్యాట్స్మెన్ ఎన్ని సెంచరీలు సాధించారో తెలుసా? ఎన్ని సెంచరీలు నమోదయ్యాయో తెలుసా?
సెంచరీ వీరులు 20.. నమోదైన సెంచరీలు 21. శ్రీలంక స్టార్ బ్యాట్సమెన్ సంగక్కర రెండు సెంచరీలు, వెస్టిండీస్ జులపాల వీరుడు క్రిస్ గేల్ డబుల్ సెంచరీ బాది క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు.
అయితే 14 దేశాల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ పోరు ముగిసేనాటికి ఇంకెన్ని సంచలనాలు, సెంచరీలు నమోదవుతాయో వేచి చూడాలి.