సండ్రకు ఏసీబీ ప్రశ్నల వర్షం

2
హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయివా వేసింది. విచారణ నిమిత్తం కోర్టు  సండ్రను రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు నేడు ఉదయం చర్లపల్లి జైలు నుంచి సండ్రను తమ అదుపులోకి తీసుకొని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. న్యాయవాదుల సమక్షంలో ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. కాల్‌ డేటాపై డబ్బు ఎక్కడనుంచి వచ్చిందని ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదిలావుంటే ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు సండ్రను విచారణ నిమిత్తం రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సండ్రను ఉదయం అధికారులు తమ అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇదే కేసులో విచారణకు హాజరుకాని జిమ్మి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిమ్మి ఏపీలోని విజయవాడ, గుంటూరులో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనికోసం ప్రత్యేక దళాలు గాలిస్తున్నాయి.