సందేశాత్మక చిత్రాలు అవార్డులకు నోచుకోవా?
` జై భీమ్ విస్మరించడంపై మండిపడుతున్న నెటిజన్లు
` అభాసు పాలవుతున్న అవార్డుల పర్వం
` న్యాయం చూపే సినిమాను వదిలేసి దోపిడీ చూపిన సినిమాకు అవార్డులా..
` సోషల్ విూడియాలో దుమారం.
హైదరాబాద్(జనంసాక్షి):జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రాల ఎంపిక విషయం ఇప్పుడు సోషల్ విూడియాలో ఎన్నడూ లేనంత దుమారం రేపుతోంది ఈసారి జాతీయ ఉత్తమ చిత్రాల ఎంపికలు సెలక్షన్ కమిటీ వ్యవహారం పై నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ చిత్రంగా అడవిని ఆధారం చేసుకుని ఎర్రచందనం ఎట్లా కొత్త పద్ధతుల్లో స్మగ్లింగ్ చేయాలనే అంశం ప్రధాన ఇతివృత్తంగా ‘‘పుష్ప’’ సినిమా ను జనం విూదికి వదిలారు సెలక్షన్ కమిటీకి ఆ సినిమాలో ఏం నచ్చిందో తెలియదు కానీ సినిమాకు అవార్డుల పంట పండిరది. ఈ విషయమే సోషల్ విూడియాలో దుమారం రేపుతుంది. ఏ ప్రాతిపదికన ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు అంటూ సోషల్ విూడియాలో నెటిజెన్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు అదే అడవిలో జీవన సాగిస్తూ న్యాయం అందరానిదైనప్పుడు బాధితులు న్యాయం కోసం తల్లడిల్లినప్పుడు వారికి అండగా నిలబడ్డ విషయాన్ని ఇతివృత్తంగా తీసుకొని ‘‘జై భీమ్ ‘‘ సినిమా రూపొందించబడిరది. ఆ సినిమాలో పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉండి పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చూపించడంలో జై భీమ్ సినిమా ప్రజలకు ఎంతో చేరువైంది.కనీసం అవార్డు విషయంలో ఈ చిత్రానికి ఏ విభాగంలోనూ అవార్డు రాకపోవడం పై సోషల్ విూడియాలో పెద్ద దుమారం రేపుతోంది. సాంకేతికంగాను అనేక అంశాలను ‘‘జై భీమ్’’ సినిమా లో ఏం తక్కువయిందంటూ నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అవార్డు సెలక్షన్ కమిటీ తీరుపై మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా సెలక్షన్ కమిటీకి ‘‘పుష్ప’’ సినిమా పై అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ ఇలా సమాజానికి ప్రయోజనం కలిగించే ‘‘జై భీమ్’ సినిమాలను వదిలేసి తమ వ్యక్తిగత ఇష్టాలతో మరో సినిమాను ఎంపిక చేయడం ఏమిటని నెటిజెన్లు మండిపడుతున్నారు. ప్రజల మనుషులను ఆకట్టుకున్న ‘‘ జై భీమ్’’ సినిమా అవార్డు ఎంపిక కాకపోయినా ప్రజల మనసులను ఆకట్టుకొని ఎప్పుడో అవార్డు కొట్టేసినట్టు సోషల్ విూడియాలో కామెంట్ల రూపంలో విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ విూడియా వేదికగా మాత్రం ‘జై భీమ్’’ సినిమానే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటులు అన్ని విభాగంలో నూ ప్రత్యేకంగా ఉందంటూ నెటిజన్లు జై భీమ్ సినిమాపై ప్రశంసల కురిపిస్తున్నారు.