సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్
కరీంనగర్: నవంబర్ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 పంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా ఉంచామని తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా వెయ్యి ఏనుగుల బలాన్ని అందించిందని ఉద్యమాన్ని రాజకీయాన్ని మేళవించి ముందుకెళతామని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ విజ్ఞప్తి మేరకే ఉద్యమాన్ని సడలించామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణను వీలిణం చేయాల్సిందిగా కోరారని మా పార్టీ నేతలు కూడి ఖచ్చితంగా తెలంగాణ ఇస్తే విలీణం చేస్తామని అన్నారని కాంగ్రెస్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపామని తెలంగాణ ఇవ్వగల్గింది కాంగ్రెసేనని అక్కడికి వెళ్లామని కాని కాంగ్రెస్ మోసం చేస్తుందని ఏ పార్టీతోను భవిష్యత్తులో పోత్తు పెట్టుకోమని కాంగ్రెస్ టీడీపీ వైకాపా ఈ మూడు పార్టీలు తెలంగాణకు వ్యతిరేఖమని చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేఖం కాదని అంటున్నాడు కాని ఒక్కసారి అనుకూలమని చెప్తే చాలన్నారు. పార్లమెంట్‌లో జగన్ సమైకాంధ్ర ప్లకార్డ్ పట్టుకున్నాడని విమర్శించారు. ముస్లీంలను బీజేపీ రజకార్లతో పోల్చడం మాకు బాధ కలిగించిందన్నారు. జేఏసీతో ఉన్న చిన్న చిన్న విభేదాలు సమసిపోతాయని త్వరలోనే జేఏసీ నేతలతో సమావేశం అవుతామని తెలిపారు. ఈ సారి ఎన్నికల ప్రస్తావన కూడా కరీంనగర్ నుండే మొదలు పెడుతామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచాలని గృహ అవసరాలకు కరెంటు అందియాలని రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఏడు గంటలు అందిచాలని డిమాండ్ చేశారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాయితీ సిలిండర్లు 12 ఇవ్వాలన్నారు. రేపటి నుండి తెలంగాణ భవన్‌లోనే ఉంటానని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 29న అన్ని నియోజక వర్గాల్లో నిరసన దీక్షలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.