సంయమనం పాటించండి

l2016071285996

కాశ్మీర్‌ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

న్యూఢిల్లీ,జూలై12(జనంసాక్షి):

కశ్మీర్‌లో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై  ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు.కాశ్మీర్‌ ప్రజలు సంయమనం  పాటిం చాలని ప్రధాని కోరారు.ఆ సమావేశానికి ప్రభుత్వాధికారులు, క్యాబినెట్‌ మంత్రలు హాజరయ్యారు.కశ్మీర్‌ కల్లోలంపై ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహిం చారు. ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి చేయిదాటకుండా చూసుకోవాలంటూ అధికారు లను మోదీ ఆదేశించారు. కశ్మీర్‌పై ప్రపంచ దేశాలన్నీ దృష్టి పెట్టాయని, సైనిక దళాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. హిజ్‌బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ మృతి తర్వాత ప్రజల్లో ఆగ్రహం ఎందుకు పెల్లుబికిందని మోదీ ఆరా తీశారు. కశ్మీర్‌లో అమాయకులు ఎవరూ బలికావొద్దని ప్రధాని మోదీ సూచించారు. ఆ రాష్టాన్రికి వీలైనంత సహాయాన్ని అందించాల న్నారు. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశాన్ని కూడా చర్చించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర పేర్కొన్నారు.  హిజ్‌బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ మృతి తర్వాత ప్రజల్లో ఆగ్రహం ఎందుకు పెల్లుబికిందని మోదీ ఆరా తీశారు.