సకాల తీర్పులతోనే సామాన్యుడికి న్యాయం

C

– న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి19(జనంసాక్షి):దేశ పురోగతిలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ నగరంలోని మారియట్‌ ¬టల్‌లో ఏర్పాటు చేసిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని కిందిస్థాయి కోర్టుల్లో సుమారు 5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో 2 లక్షల 72 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు వివరించారు. న్యాయాన్ని ఆశించి సామాన్యులు కోర్టులను ఆశ్రయిస్తారని తెలిపారు. అందరూ కలిసి సత్వర న్యాయం అందించేందుకు చేస్తోన్న కృషి సంతోషకరమన్నారు. ఎవరికి వారు సమర్థవంతంగా పనిచేయడం వల్లే దేశ పురోభివృద్ధి సాధ్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తాత్కాలిక న్యాయమూర్తి చక్కటి చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.

సత్వర న్యాయం కోసం చర్యలు తీసుకోవాలి

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మారియట్‌ ¬టల్‌ లో న్యాయాధికారుల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేశ పురోగతిలో న్యాయ వ్యవస్థ కీలకమైనదని సీఎం చెప్పారు. సదస్సు ఏర్పాటుకు సంబంధించి తాత్కాలిక న్యాయమూర్తి చక్కటి చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ? పెండింగ్‌ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణలోని కింది కోర్టుల్లో 5 లక్షలు? ఉమ్మడి హై కోర్టులో 2 లక్షల 72 వేల కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని వివరించారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

కోర్టు తీర్పులు ప్రామాణికంగా ఉండాలిన్యాయస్థానంలో వెలువరించే తీర్పు ప్రామాణికంగా ఉండడంతో పాటు సకాలంలో న్యాయం అందేలా ఉండాలని న్యాయసదస్సు అభిప్రాయపడింది. కక్షిదారులకు ఇచ్చే తీర్పును సత్వరం, సంతృప్తినిచ్చేవిగా ఉండాలని సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు, న్యాయమూర్తులు పేర్కొన్నారు. సకాలంలో న్యాయం అందకపోతే జరిగే నష్టం అపారమైనదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సత్వరం న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జిలు, మేజిస్టేట్ల్రకు సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్ల్రోని న్యాయమూర్తులు, మేజిస్టేట్ల్రకు రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన సమావేశం శనివారం ఉదయం హైదరాబాద్‌ మారియట్‌ ¬టల్‌లో ప్రారంభమైంది. కార్యక్రమంలో దాదాపు వెయ్యిమంది న్యాయమూర్తులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ.. న్యాయసేవ అనేది సమాజ సేవ వంటిందన్నారు.  న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తథ్యమని భగవద్గీత చెబుతోందన్నారు. న్యాయం అందించటంలో పేదలు, ధనికులు అనే తారతమ్యం ఉండకూడదన్నారు. తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పనిచేస్తున్నారన్నారు. తెలుగు రాష్టాల్ర  న్యాయాధికారుల సదస్సులో పాలుపంచుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అధునాతన హైకోర్టు భవనాన్ని నిరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక యుగం హవా కొనసాగుతోంది.. అన్ని కోర్టుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గతంలో చైనాను ప్రస్తావించేవారు.. ప్రస్తుతం భారత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ న్యాయాధికారులు, ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలు అని చంద్రబాబు అన్నారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏపీలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభించామని, జులై నాటికి పూర్తి అవుతుందన్నారు. అన్ని కోర్టుల్లో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్‌లో న్యాయవవస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే పరిష్కరించుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. అందరూ కలిసి సత్వర న్యాయం అందించేందుకు చేస్తున్న కృషి సంతోషకరమన్నారు. దేశ పురోభివృద్ధిలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమన్న ఆయన.. ఎవరికివారు సమర్థవంతంగా పనిచేయటం వల్లే దేశ పురోభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో దాదాపు 5లక్షల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశాభివృద్ధిలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమని అన్నారు.  కింది కోర్టుల్లో 5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. రెండు రాష్టాల్ల్రో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 35శాతం కేసులు వేగంగా పరిష్కరించేందుకు హైకోర్టు సీజే చేసిన కృషి అభినంద నీయమన్నారు. న్యాయాన్ని ఆశించి సామాన్యులు కోర్టులను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఆర్‌.దవే, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.బోసలే తదితరులు హాజరయ్యారు. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్వీరమణ, దీపక్‌ మిశ్రా తదితరులు హాజరయ్యారు.