సచిన్‌ను కిడ్నాప్ చేయాలి..!!
భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆడుతున్న తీరును చూస్తే వారికి శిక్షణ ఇప్పించడానికి సచిన్ తెందుల్కర్‌ను కిడ్నాప్ చేయాలేమోనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ జరుగుతున్న తీరు చూస్తే.. ఇంగ్లాండ్‌కు శిక్షణ ఇప్పించడానికి సచిన్‌ను కిడ్నాప్ చేయాలేమో అనిపిస్తోంది’’ అని కామెరున్ నవ్వులు పూయించారు.