సత్యం స్కామ్‌లో రూ.1,800 కోట్లు జరిమానా

1
హౖెెదరాబాద్‌  సెప్టెంబర్‌10(జనంసాక్షి): దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్‌ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు అక్రమంగా పోగేసుకున్న రూ. 1800 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. 2009 జనవరి ఏడో తేదీ నుంచి జరిమానా విధించాల్సి ఉన్నందున.. ఆ మొత్తం విూద వడ్డీగా మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించా లని తెలిపింది. ఈ పది సంస్థలు రామలింగరాజు సవిూప బంధువులవే. వాళ్లలో ఆయన తల్లి, సోదరుడు, కుమారుడు.. కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో అకౌంట్లు తెరిచి, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి

నందుకు గాను ఈ జరిమానాలు విధించారు.రామలింగరాజుతో పాటు మరో నలుగురిని 14 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి సెబి బహిష్కరించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 1849 కోట్ల ను వడ్డీతో సహా చెల్లించాలని గత సంవత్సరం జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, ఆయన సోద రుడు (నాటి సత్యం ఎండీ) రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌ (మాజీ సీఎఫ్‌ఓ), జి.రామకృష్ణ (నాటి వైస్‌ ప్రెసిడెంట్‌), వీఎస్‌ ప్రభాకర గుప్తా (అంతర్గత ఆడిట్‌ విభాగం మాజీ అధిపతి)లపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.    ఇక తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను కూడా సెబి ఈ కేసులో పెట్టింది. ఈ కంపెనీలలో ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ ¬ల్డింగ్స్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌

(ఇంతకుముందు మేటాస్‌ ఇన్‌ఫ్రా) ఉన్నాయి. రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ, ఆమె ఇద్దరు

కుమారులు తేజరాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన భార్య ఝాన్సీ రాణి, చింతలపాటి శ్రీనివాస్‌ (నాటి డైరెక్టర్‌), ఆయన తండ్రి దివంగత అంజిరాజు తదితరులు కూడా ఉన్నారు.

ప్ర