సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

దండేపల్లి మండలంలోని వూట్ల గిరిజన గ్రామంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించి పులిహోర పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంపై అవగాహన కల్పించారు. అనంతరం దండేపల్లిలో బాల వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ఐకాస కన్వీనకర్‌ శంకర్‌గౌడ్‌, సత్యసాయి భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.