సన్సేషన్‌ న్యూస్‌ వింటారు

5

– ఒక్కరోజు ఆగండి

-మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): రేపు ఏం జరగబోతోంది. మహా అయితే పలు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలతో పాటు పాలేరు ఎన్నిక ఫలితం కూడా వెల్లడవుతుంది. కానీ మంత్రి కెటిరా మాత్రం అదేదీ కాదనే విధంగా ఓ సంచలన వార్త ఉంటుందంటూ ట్విట్టర్‌ ద్వారా మనం సమాచారం ఇచ్చారు.   ఓ పెద్ద సంచలన వార్తను ప్రకటించనున్నట్టు సోషల్‌ విూడియా ద్వారా ప్రకటించారు కెటిఆర్‌. అయితే ఇప్పుడు కాదని, అంతా గురువారం  విూతో పంచుకుంటానని ఆసక్తిని కలగజేసారు. అంతవరకు సస్పెన్స్‌ అంటూ కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా వదిలేసారు. స్వాభావికంగా కేటీఆర్‌ సీరియస్‌గానే ఉంటారు కాబట్టి ఏదో పెద్ద విషయాన్నే వెల్లడించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తర్వాత నెంబర్‌ 2గా పార్టీ భాద్యతలు నిర్వహిస్తోన్న కెటీఆర్‌ తనదైన పంథాలో దూసుకుపోతున్నారు. మరి తాను ఎల్లుండి చెప్పబోయే విషయం దేని గురించనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఏంటన్నది మన ఊహకు వదిలేశారు. పాలేరు ఉప ఎన్‌ఇనక కౌంటంఇంగ్‌ 19న ఉంటుంది. అందులో తుమ్మల ఎలాగూ గెలుస్తారు. అంతకు మించి ఏం ఉంటుందనేది బుర్రబద్దలు కొట్టుకునే బదులు వేచి చూడడం మేలు.