జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏప్రిల్ 2( జనం సాక్షి)జగిత్యాల జిల్లాధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ అతివేగంగా దూసుకు వచ్చి ఆటోను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ను అతివేగంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు హనుమాన్ దీక్షదారులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మృతులను ధర్మపురి పట్టణ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.