సఫారీల విజయ హాసం
రెండో అతిపెద్ద విజయం నమోదు
కాన్‌బెర్రా,మార్చి3(జనంసాక్షి): క్రికెట్ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా రెండో భారీ విజయాన్ని సాధించింది. ఇవాళ కాన్‌బెర్రా వేదికగా జరిగిన వన్డేలో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. క్రితం మ్యాచ్‌లో వెస్టిండీస్‌పైన కూడా 200 పరుగలకుపైగా తెడాతో సఫారీలు సూపర్ హిట్ కొట్టారు. ఈ వరల్డ్‌కప్‌లో200 పరుగులకు పైగా తేడాతో రెండు విజయాలు నమోదు చేసిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు సాధించింది. 412 పరుగుల టార్గెట్‌ను చేధించడానికి బరిలో దిగిన ఐర్లాండ్‌ను ఐదు ఓవర్లు మిగిలుండగానే 210పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ చేసింది. మొదట్నుంచీ మ్యాచ్ వన్‌సైడ్‌గా సాగింది. బాల్‌బైన్ర్ 58, ఓబైన్ర్ 48 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లంతా 25 పరుగులలోపే ఔటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలరర్లు అబాట్ 4, మోర్కెల్ 3, స్టేయిన్ 2 వికెట్లు తీశారు. డివిలియర్స్ ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మొదట్నుంచీ దూకుడుగా ఆడింది. 12 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయినా అనంతరం వికెట్లను కాపాడుకుంటూ సఫారీలు స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఆమ్లా (159), డు ప్లెసిస్ (109)లు సెంచీరీలో కదం తొక్కారు. రోసోవ్ సైతం అర్థసెంచరీ పూర్తి చేసుకుని 61 పరుగులు సాధించాడు.