సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి
సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నది. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమంగా చూస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్ణంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న ఆధునిక దోభీఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన, బుడగ జంగాల సంక్షేమ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అలాగే తొర్రూరులో బుడిగ జంగాల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేశారు. బుడగజంగాలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా మంత్రి స్వయంగా బైక్ నడిపి బుడగ జంగాల యువకులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడుగంటిపోయిన కులవృత్తులకు సీఎం కేసీఆర్ పునర్జీవం పోశారు. ఆయా కులాలు వృత్తుల వారీగా వారి ప్రాధాన్యతలను పట్టి వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
త్వరలోనే రజక సంక్షేమ భవనాన్ని కూడా నిర్మించి తొర్రూరు పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. మీరు బీఆర్‌ఎస్‌కు అండగా నిలవండి. మీకు ఎల్లప్పుడూ అండదండలు అంది స్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.