సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్

ctt63pnyదిల్లీ: రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలను వివరించారు. మేకిన్‌ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు రానున్నాయని, మేకిన్‌ ఇండియా జీడీపీ వృద్ధికి మార్గమని పేర్కొన్నారు. వివిధ అంశాలపై రాష్ట్రపతి… గంటా 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

* తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా
* భూసార పరీక్షల కార్డులు పంపిణీ, 8వేల క్లస్టర్లద్వారా ప్రకృతి వ్యవసాయం
* రైతులకు చేయూత, యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది.

* రైతులకు గిట్టుబాటు ధర కల్పన కోసం ఈ-మార్కెట్లు ఏర్పాటు. దేశంలో ఎక్కడైనా పంట ఉత్పత్తులు అమ్ముకునే వెసులుబాటు
*ప్రభుత్వం కొత్త యూరియా విధానం అమలు చేస్తోంది. * కొత్త విధానం ద్వారా మూడేళ్లలో 17లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

* గ్రామీణాభివృద్ధికి పాల ఉత్పత్తి, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు ప్రోత్సాహం
* రైతుల అభ్యున్నతికి 109 కిసాన్‌ వికాస్‌ కేంద్రాలు
* ఐదు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి.

* గ్రామీణాభివృద్ధి ద్వారా రూ.2లక్షల కోట్ల మేర పనులు
* రూ.24,600 కోట్లతో పట్టణ గృహ నిర్మాణ పథకం
* ఆహార భద్రత పథకం ద్వారా 68 కోట్ల మందికి ప్రయోజనం

* గ్రామీణ పేదల్లో 50లక్షల మందికి కొత్త గ్యాస్‌ కనెక్షన్లు
* మైనారిటీలకోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో 50శాతం ఉపకార వేతనాలకు కేటాయింపు
* ముద్ర యోజన ద్వారా ఔత్సాహిక మహిళలకు ఇతోధికంగా రుణాలు

* మేకిన్‌ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు, జీడీపీ వృద్ధికి మార్గం
* నిరుద్యోగులను ఉద్యోగాలిచ్చే వారిగా మార్చడమే మేకిన్‌ ఇండియా లక్ష్యం
* స్వచ్ఛభారత్‌ ద్వారా ఆరోగ్య భారత్‌ను రూపొందించే ప్రయత్నం

* రైల్వే స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ఎన్నో చర్యలు చేపట్టాం.* జాతీయ ఖనిజ నిధి ద్వారా పారదర్శకంగా గనుల విధానం
* జపాన్‌ ప్రభుత్వం సాయంతో హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు
*డిజిటల్‌ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌

*విమానయాన రంగంలో కొత్త విధానం అమలు. దేశంలోని చిన్న నగరాలకు విమానయాన సౌకర్యం పెంపు. గత ఏడాది కాలంలో దేశీయ విమానయానం గణనీయంగా పెరిగింది.
* పర్యాటక రంగంలో స్వదేశ్‌ దర్శన్‌ ద్వారా 13 సర్క్యూట్ల గుర్తింపు.
* పారదర్శకంగా ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో లైసెన్సులు జారీ చేయనున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.