సబ్ రిజిస్ట్రార్ఇంటిపై ఏసీబీ దాడులు
మేడ్చల్ : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్ బీ నగర్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు రమేష్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మొత్తం 7 చోట్ల సోదాలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఎల్ బీ నగర్, నాగోల్, కొత్తపేట, అల్మాస్ గూడ, ఉప్పల్, సైదాబాద్, కోకాపేట్ , మలక్ పేట్ లో తదితర ప్రాంతాల్ఓ ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రమేష్ కు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవనున్నారు. అటు ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లు శ్రీనివాసరావు, యూసుఫ్ ల ఇళ్లపై మూడు రోజులుగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.