సభసాగేందుకు సహకరించండి

నిర్మాణాత్మక సూచనల్విండి : ప్రధాని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్ర విజ్ఞప్తి చేశారు. సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆయన ఆశాభావం
వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో భార’ అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొంటుందని.. ఈ నేపథ్యంలో విశ్వసనీయ చర్యలు తీసుకుంటున్నట్లు జాతికి హావిూ ఇచ్చేలా అన్ని పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంట్‌కు ప్రధాని.. విలేకరులతో మాట్లాడారు. ”ఇది మనందరం సవాలుగా స్వీకరించాల్సిన సమయమిది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంద్ణి అని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ఉభయ సభల్లో అన్ని పక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ల కుంభకోణం, ధరల పెరుగుదల, మహిళలపై నేరాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని కోరారు. ”సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆశాభావం ఉంది. పార్లమెంట్‌లో చర్చలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంద్ణి అని అన్నారు. ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాలని ప్రభుత్వం, ప్రజలు ఆశిస్తున్న రీతిలో చర్చ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.