సమగ్ర భూసర్వే విప్లవాత్మక నిర్ణయం

 

ఇది దేశానికే ఆదర్శం కాబోతున్నది

విమర్శల బదులు సూచనలు చేసే ధైర్యం కావాలి

ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి

హైదరాబాద్‌,ఆగస్ట్‌31): రైతు సమన్వయ కమిటీలు,భూసర్వే అన్నవి విప్లవాత్మకనిర్ణయాలని దీంతో తెలంగాణ ముఖచిత్రం మారగలదని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌ వేణుగోపాలాచారి అన్నారు. భూ రికార్డులు సక్రమంగా ఉంటేనే వివాదాలకు తావుండదని, అలాగే అభివృద్దికి ప్రాతిపదిక ఉంటుందని ఆయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో అన్నారు. ఇవి అమల్లోకి వస్తే గ్రామాల ముఖచిత్రం మారనుందని అన్నారు. అలాగే భూసమగ్ర సర్వే దేశానికి మార్గదర్శనం కానుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి తీసుకునే నిర్ణయాలను ఎవరైనా స్వాగతించాల్సిందేనని అన్నారు. లోటుపాట్లు ఉంటే సూచనలు చేయాలన్నారు. అదేపనిగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. భూరికార్డులు సరిగా ఉంటే కాంగ్రెస్‌ నాయకులకు పంచాయితీ చేసే అవకాశం ఉండదని, గతంలో రైతుల మధ్య పంచాయితీ పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు దేశంలో మొదటిసారిగా జరుగుతుందన్నారు. భూ రికార్డులను సరిచేస్తామంటే కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడంలేదని హరీశ్‌రావు అన్నారు. నిజాం కాలం తర్వాత మళ్లీ భూ సర్వే జరుగలేదని గుర్తుచేశారు. రికార్డులన్నీ ప్రక్షాళన చేయకపోవడంతో గందరగోళంగా ఉందని, అస్తవ్యస్త రికార్డుల వల్లనే భూ వివాదాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. అందుకే గ్రామసభలుపెట్టి, రైతుల భాగస్వామ్యంతో రికార్డులను సరిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. భూ

వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, రైతులకు భూ హక్కులపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని చెప్పారు. భూ సర్వేను టీఆర్‌ఎస్‌ నాయకులు చేయరని, రెవెన్యూ ఉద్యోగులే చేస్తారనే కనీసం పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ

అడ్రస్‌ గల్లంతవుతుందనే భయంతోనే రైతు సమన్వయ కమిటీలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని, దేశవ్యాప్తంగా అది విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. మునిగిపోయే పడవలో ప్రయాణించాలని ఎవరూ కోరుకోరనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకత్వం విశ్‌ఆసం కోల్పోయిందని అన్నారు. ప్రియాంకను తీసుకుని రావాలని కొందరు, రాహుల్‌ను అధ్యక్షుడిని చేయాలని మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు పట్టుబడుఉతన్నారే తప్ప ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడున్న స్థితి కూడా ఉండదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే పార్టీ మరింతగా దిగజారగలదనే విషయాన్ని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే చెప్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వచ్చే 20 ఏండ్ల వరకూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అధికారానికి ఢోకాలేదని అన్నారు. అభివృద్ధిని నిరోధించేందుకు కోర్టుకు వెళ్లడం తప్ప కాంగ్రెస్‌ నాయకులకు మరేం తెలియదని విమర్శించారు. సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు తెలంగాణ అభివృద్దికి బాటలు వేస్తున్నాయని అందుకే అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు దగ్గర కావడాన్ని కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. నిరాశా, నిస్పృహలు తారస్థాయికి చేరడంతో మరింత దిగజారిన కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని, కార్యకర్తల బలాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష ¬దా కోల్పోయిన ఆ పార్టీ 2019లో తెలంగాణలో కూడా ప్రతిపక్ష ¬దా కోల్పోక తప్పదని అన్నారు. ఆదర్శ రైతుల పేరిట కాంగ్రెస్‌ పార్టీ వారి కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెడితే.. తెలంగాణ సర్కారు మాత్రం స్వచ్ఛందంగా రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యవసాయాభివృద్ధికోసం, రైతుల కోసం పనిచేసిందిలేదని, అందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా వాళ్ల లాగనే ఉండాలని కోరుకుంటున్నారని ఎద్దేవాచేశారు. రైతుల బాధలు తెలిసినందున వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేయాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సిఎం కెసిఆర్‌ కంకణం కట్టుకున్నారని చెప్పారు.నిరంతర విద్యుత్‌,రైతులకు రుణమాఫీ, ఇప్పుడు ఎకరాకు 4వేల సాయం తదితర కార్యక్రమాలు దేశాన్ని ఆలోచింప చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే రైతులే బుద్ధి చెప్తారని వేణుగోపాలాచారి హెచ్చరించారు.