*సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.
* సూపర్వైజర్ జయప్రద.
చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. శనివారం మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలో పోషకాహార మాసోత్సవాలను గ్రామ సర్పంచ్ దుప్పటి రజిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద పాల్గొని పోషకార ప్రాముఖ్యత గూర్చి వివరించారు. పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సమతుల హారం భుజించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం త్రాగే నీరు వడగట్టి కాచిన నీళ్లను త్రాగడం చిరుధాన్యాలు మొలకెత్తించిన గింజలు పాలు, పండ్లు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. హై స్కూల్ పిల్లలకి పోషకార ప్రాముఖ్యత గూర్చి ముఖ్యంగా పిల్లలందరూ మొబైల్ వాడడం టీవీలో వచ్చే సీరియల్స్ చూడకూడదని అన్ని రకాల ఆహారపదార్థాలను సమపాళ్లలో తీసుకున్నప్పుడు ఆలోచన శక్తి పెంపొంది, చదువు పైన శ్రద్ధ కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ మహేందర్ ఉప సర్పంచ్ మహేందర్, గ్రామ సెక్రెటరీ , హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, నీలవర్ణ, జ్యోతి, ఉమాదేవి, ఐకెపి సి ఎ కోడూరు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.