సమస్యలపై సర్వే నిర్వహించిన సిఐటియు

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండా గ్రామంలో సిఐటియు. రైతు సంఘం. వ్యవసాయ కార్మిక సంఘం. ఆధ్వర్యాన స్థానిక సమస్యలపై సర్వే చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలోప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం సర్వేలు నిర్వహించి ఇట్టి సర్వేలపై సమస్యలను అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి ప్రజలు సిద్ధం కావాలని వారన్నారు. తండలో గిరిజనులకు ఇండ్లు. ఇళ్లస్థలాలు. రేషన్ కార్డులు. పింఛన్లు. డబల్ బెడ్ రూమ్. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు. వంటరు మహిళలకు పింఛన్లు ఆన్లైన్ చేసుకున్న ఇంతమాటకి రాలేదని ప్రజలు ప్రజాసంఘాల బృందాలకు తెలియజేయడం జరిగింది. తండలో రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్న సమాధి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు అన్నారు ఇట్టి సమస్యలపై ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు T.స్వామి. శంకర్. లక్ష్మయ్య. సైదా. బాలు. వెంకటేశ్వర్లు. సైరా నాయక్. రవి. జగన్. తదితరులు పాల్గొన్నారు