సమస్యలపై స్పష్టతతో సాగాలి

అధికార పార్టీ తీరుపై లెఫ్ట పార్టీల ఆగ్రహం
అమరావతి, పోలవరం, పై నిలదీయాలి

అమరావతి,జూలై16(జనం సాక్షి ): వివిధ అంశాలపై పార్లమెంటులో పోరాడాలని టిడిపి నిర్ణయించినందున, అధికార వైసిపి కూడా అందుకు సన్నద్దంగా ఉండాలని లెఫ్ట్‌ తదితర పార్టీలో కోరుతున్నాయి. పోలవరం, విశాఖ ఉక్కు, రాజధానిపై స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని అన్నారు. మూడేళ్లుగా రాజధాని లేని రాజ్యంగా ఎపి వెలుగొందుతోంది. మూడు రాజధానులు అంటూ ఆంధ్రుల రాజధాని అమరావతిని దేశ ప్రజల ముందు నవ్వులపాలు చేశారు. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం రాజధాని మార్పు అధికారం శాసనసభకు లేదని చెబితే, న్యాయమూర్తులకు కూడా మరక అంటకట్టారు. రాజ్యాంగ వ్యవస్థలపై కాలు దువ్వకుండా రాజధాని నిర్మాణం చేసివుంటే బాగుండేది. మూడేళ్లుగా జనగ్‌ సర్కార్‌ రాజధాని, పోలవరం, విశాఖ విషయంలో గట్టిగా నిలబడలేక పోయింది. రాజధాని అమరావతిపై ఎడారి అనీ, స్మశానం అనీ, కమ్మవారిదే అనీ, చంద్రబాబు బినావిూలది అనీ చాలా పేర్లు పెట్టి చివరకు రాజధాని రైతులను రోడ్డెక్కాలా చేశారు. మూడు రాజధానులు అనే మూర్ఖపు ఆలోచనతో మూడు ప్రాంతాల్లో విభజన మంటలు రేపారు. అరచాకాలను అడ్డుకోలేక పోతున్నారు. ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో, రైల్వేస్టేషన్లో అత్యాచారాలు నమోదయ్యాయి. ప్రభుత్వ పాలనను విమర్శించే వారిపై దాడులు దారుణం కాక మరోటి కాదు.చోరీ కేసులో అబ్దుల్‌ సలాం పోలీసు వేధింపులకు తాళలేక నలుగురు కుటుంబసభ్యులతో రైలు
పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులో వజీరా, పులివెందులో నాగమ్మ, నంద్యాలలో మహాలక్ష్మి, గుంటూరులో రమ, చిలకలూరిపేటలో అనూష, గుంటూరులో భూక్య రమాబాయ్‌, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం… ఇలా ఎందరో విగతజీవులయ్యారు. మానసిక వికలాంగురాలిపై, మూగ మహిళపై అత్యాచారాలు జరిగాయి. పేరేచర్లలో ఒక దళిత మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో 80 మంది నిందితులు ఉన్నారని పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయినా ప్రభుత్వం ప్రతి అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీపై నిందలు వేస్తూ, ఏ ఒక్క సంఘటనకూ బాధ్యత తీసుకోవటం లేదు. ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, ధరలు పెంచినా, చెత్తపన్ను వేసినా, లక్షల కోట్లు అప్పలు చేసినా అన్నింటికీ గత ప్రభుత్వంలో జరగలేదా అన్నదే వైకాపా సమాధానంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గర్వంగా ప్రకటించుకుంటున్నారు. అయితే రోడ్ల దుస్థితి కానీ, విద్యుత్‌ సమస్యలపై కానీ ఏనాడు దృష్టి సారించలేదు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తరవాత చేస్తున్న పనులను సమర్థించుకుంటున్నారు. పేదలకు ఎంత వీలైతే అంత మేర మేలు చేసే ప్రభుత్వం తమదని అంటూ డబ్బులను పందేరం చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది అంటూ గత ప్రభుత్వంపై విమర్వలకు దిగుతున్నారు. . అర్హులందరికీ కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించే ప్రభుత్వం మనదని సీఎం జగన్‌ ప్రకటించుకుంటున్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పుల కంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని తాజాగా విశాఖలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అప్పులు చేసి కూడా టీడీపీ సర్కారు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. అసత్యాలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విపక్షాలపై ధ్వజమెత్తారు.