“సమాజ చైతన్యానికి సాహిత్యమే దిక్సూచి ” పెద్దింటి అశోక్ కుమార్

ముప్కాల్ (జనం సాక్షి) నగరంలో ఆదివారం జరిగిన “మందారం సాహిత్య సమాఖ్య “ఆధ్వర్యంలో మందారం కథల పోటీలు ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి కవి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ హాజరై నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజ చైతన్యానికి సాహిత్యం దిక్సూచి వంటిదని మంచి సామాజిక స్పృహ చైతన్యం ఉన్న కథలను రచించి సమాజంలో ఉత్తేజాన్ని కలిగించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన మందారం ,కథల ,పోటీలు గెలుపొందిన కవులకు బహుమతులను ప్రశంసా పత్రం శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో “పోలీస్ కవి” తొగర్ల సురేష్ రచించిన కోనేరు దీర్ఘ కవిత పుస్తకాన్ని పెద్దింటి అశోక్ కుమార్ మరియు అతిథులు ఆవిష్కరించారు కార్యక్రమం అనంతరం తొగర్ల సురేష్ ని ‘మందార సాహిత్య’ సమాఖ్య అధ్యక్షుడు దారం గంగాధర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృతలత వయసా దేవిదాస్ విపి చందన్ రావు తొగర్ల సురేష్ డాక్టర్ త్రివేణి కాసర్ల నరేష్ సాయిబాబు వక్తలు కవులు పాల్గొన్నారు