సమాజ సేవలు కోమటి కృష్ణయ్య చారిటబుల్ ట్రస్ట్ అగ్రస్థానంలో నిలవాలి

 కోదాడ టౌన్ జూలై 24 ( జనంసాక్షి )
సమాజ సేవలు కోమటి కృష్ణయ్య చారిటబుల్ ట్రస్ట్ అగ్రస్థానంలో నిలవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో పురమా రంగారావు సీతారావమ్మా కళ్యాణ మండపంలో  కోమటి కృష్ణయ్య దంపతులకు ట్రస్ట్ సభ్యులు  ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆత్మీయ సమ్మేళనాలతో సోదర భావాలు పెంపొందుతాయన్నారు.కృష్ణయ్య రాజకీయాల్లో ఉంటూ మంచి పేరు సాధించారన్నారు.కృష్ణయ్య దంపతులకు ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు తెలిపారు.బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్య రెడ్డి మాట్లాడుతూ కోమటి కృష్ణయ్య బీజేపీలో అనేక పదవులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసారన్నారు.కృష్ణయ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి బీజేపీ పార్టీ కి వన్నె తెస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా పలు హోదాల్లో ఉన్న నాయకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కనగాల వెంకట్రామయ్య,నూనె సులోచన, బొలి శెట్టి కృష్ణయ్య,వంగవీటి శ్రీనివాసరావు,కనగాల నారాయణ, కోమటి కృష్ణయ్య,ట్రస్ట్ చైర్మన్ కోమటి నాగేశ్వరరావు, ట్రస్టు సభ్యులు కోమటి నరసింహారావు,కోమటి శ్రీనివాసరావు,కోమటి వెంకట రామారావు,కోమటి వెంకటరమణ,కోమటి జగన్నాథం,కోమటి శ్రీనివాస్,
కోమటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.