సమిష్టిగా పినిచేద్దాం

5

– ‘పశ్చిమ’ ఆధిపత్యాన్ని నిలువరిద్దాం

– బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని మోదీ

మాస్కో, జులై 9 (జనంసాక్షి):

ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బ్రిక్స్‌ వేదికగా చర్చించడం ఆనందంగా ఉందని సమిష్టిగా రలిసి పని చేద్దాం అని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు.పశ్చిమ దేవాల ఆధిపత్యాన్ని నిలవరించేందుకు ఏకం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.వాతావరణంలో అసమాన మార్పులు అంతర్జాతీయ సవాళ్లుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావించిన మోదీ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని,  పర్యావరణ పరిరక్షణకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెంచాలని కోరారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.బ్రిక్స్‌ దేశాలు వ్యవసాయ ఉత్పత్తుల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.   ఈ సందర్భంగా యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని విజయవంతం చేసిన బ్రిక్స్‌ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా బ్రిక్స్‌ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రష్యాలోని ఉఫా వేదికగా జరుగుతున్న 7వ బ్రిక్స్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఐదు దేశాల ప్రభుత్వాధినేతలు… భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రూజెఫ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా హాజరయ్యారు. ఆర్థిక ప్రగతి, పరస్పర సహకారం, నూతన అభివృద్ధి బ్యాంకు, మాదకద్రవ్యాల అక్రమరవాణా నిర్మూలన, దేశాల మధ్య విద్యుత్‌ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.  రష్యా పర్యటనలో భాగంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉఫాలో ఇరాన్‌ అధ్యక్షుడితో బేటీ అయిన ప్రధాని ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఇదిలావుంటే తాను కూడా యోగా చేయడానికి ప్రయత్నిస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత ప్రధాని నరేంద్రమోదీకి హావిూ ఇచ్చారు. బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐరాస అంగీకరించడంతో జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. తన తీర్మానానికి మద్దతిచ్చినందుకు, యోగా దినోత్సవాన్ని నిర్వహించినందుకు ప్రధాని రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.