సమ్మెకు ఇది సయయం కాదు

4

– ఆర్‌టీసి ఎండీ సాంబశివరావు

హైదరాబాద్‌ మే 6 (జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెకు ఇది సమయం కాదని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సమ్మె ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలనుకోవడం సబబుకాదన్నారు. ప్రజల ఇబ్బందులు గమనించి కార్మికులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికసంఘాలతో చర్చలకు తాము సిద్ధంగా వున్నట్టు ఆయన అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ 24 శాతం కంటే ఫిట్‌మెంట్‌ పెంచలేదని అయితే 27 శాతం పెంచేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆయన వెల్లడించారు. బుధవారం సాయంత్రం బస్‌భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకోవడం మంచిది కాదన్నారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.