సరస్వతి నది జాడతెలిసింది


` నదీగర్భంలో భారీగా ఇసుక, నీరుగుర్తించిన ఎన్జీఆర్‌ఐటీ శాస్త్రవేత్తలు
ప్రయాగ్‌రాజ్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిరచారు. ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ల క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని దాని సారాంశం. అంతేకాకుండా భూ గర్భంలో సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన జలవనరుల నిపుణులు అప్పట్లో పేర్కొన్నారు. అయితే, హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.విూ వరకు (హిమాలయాల వైపు) సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు కి.విూ. వెడల్పున, 15 విూటర్ల లోతున 270 కోట్ల ఘనపు విూటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు విూటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు. గంగ, యమున నదుల నీటికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సరస్వతి నది ఉపయోగపడుతుందని గుర్తించారు. ఈ విషయాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ జర్నల్‌ ఈ నెల ఒకటో తేదీన ప్రచురించింది.