సరస్వతీదేవి రూపంలో అమ్మవారు

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 :  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో కొలువుదీరారు. నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఉదయం 10.30 గంటలకు మూలనక్షత్ర సహిర సరస్వతీ దేవికి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో పిల్లలు హాజరై సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్నారు.  అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటలకు భక్తి పాటల పోటీలు, విచిత్ర వేషాధారణ చేపట్టారు. రాత్రి 8.30 గంటలకు తెలుగులో మాట్లాడడం తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇదిలా ఉండగా ఆదివారం  ఉదయం ఆలయంలో ఉదయం 10.30 గంటలకు రంగోళి మెహందీ, సాయంత్రం 5 గంటలకు సామూహిక సుమంగళి పసుపుబొట్లు, రాత్రి అపరాజిత వైభవం(ప్రవచనం), బ్రహ్మశ్రీ కేదారనాథ గురువు కామారెడ్డి వారిచే నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

తాజావార్తలు