సరస్వతీ దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)
శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ మాతను సరస్వతి దేవిగా ఆదివారం అలంకరించారు. ఉత్సవాల ఏడో రోజున భక్తులు అమ్మవారిని ఎక్కువ సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఇతర అర్చక బృందం భక్తులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.