సరికొత్త పరిజ్ఞానంతో 3డీ బయోనిక్ చెవి
వాషింగ్టన్: సాధారణ మానవ చెవికన్నా అదిక సామర్ధ్యంతో, ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీని వినగలిగిన కృత్రిమ బయోనిక్ చెవిని శాస్త్రవేత్లఉ రూపొందించారు. 3డీ ప్రింటింగ్ ప్రక్రియలో దీనిని రూపొందించడం విశేషం. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 3డీ ప్రక్రియ ద్వారా కణాలను, అతి సూక్ష్మ పరహాణువులను ముద్రించే పరిజ్ఞానాన్ని విజయవంతంగా సుసాధ్యం చేశారు. దీనితోపాటు ఓ కార్టిలేజ్‌తో కూడిన చిన్న కాయిల్ యాంటెన్నా సాయంతో బయోనిక్ చెవిని రూపొందించారు. శాస్త్రవేత్తలు మైఖెల్ మెక్‌కఅల్పైన్, నబీస్ వర్మలు చేపట్టిన ఈ అధ్యయనంలో ఎలక్ట్రానిక్స్‌ను, బయోలజీని కలిపి 3డీ పద్దతిలో నిరాంమనాల్ని రూపొందించడంలో సరికొత్త విధానానికి తెరతీశారు. ప్లాస్టిక్ సర్జరీ, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగాల్లో సైతం అత్యంత క్లిష్టతరమైన చెవి పునర్‌నిర్మాణాన్ని వీరు 3డి ప్రంటింగ్ ప్రక్రియ ద్వారా రూపొందించారు. ఈ ప్రింటర్లు కంప్యూటర్ డిజైన్ సాయంతో వస్తువులను రూపొందిస్తాయి. ఈ ప్రింటర్ ప్లాస్టిక్ మొదలు కణాల దాకా భిన్నమైన పదార్థాలను సన్నని పొరల్లా ఒకచోట చేర్చి అవసరమూన ఆకృతిని నిర్మిస్తుంది. కణజాలాన్ని ఎలక్ట్రానిక్స్‌తో అనుసంధానించేందుకు 3డి ప్రింటింగ్ ప్రక్రియ సౌకర్యవంతమైన విధానమని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఎలక్ట్రానిక్, జీవ సంబంధ పదార్థాలను కలిపే విషయంలో ఎదురయ్యే మెకానికల్, ధర్మల్ సవాళ్లను అదిగమించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.