సరిహద్దులపై చైనా-భారత్‌ కీలక భేటీ

1

పెట్టుబడులు, అరుణాచల్‌ ప్రదేశ్‌ వీసాల పంపిణీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

బీజింగ్‌,మే15(జనంసాక్షి): రెండో రోజు చైనా పర్యటనలో భాగంగా భారత ప్రదాని నరేంద్రమోదీ శుక్రవారం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ వద్ద ప్రధాని మోదీని చినా అధికారికంగా స్వాగతించింది. మోదీ స్వాగత కార్యక్రమంలో చినా ప్రధాని లీ కెషాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోదీ చినా ప్రధాని లీ కెషాంగ్‌ను కలిశారు. సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు.  రెండో రోజు చినా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ బీజింగ్‌లో చినా ప్రధాని లీ కెషాంగ్‌తో భేటీ ముగిసింది. సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చ జరిగింది. భారత్‌, చైనా మధ్య 24 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. ఇరుదేశాల రాజధానులు, నగరాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు.  సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌, చైనా మధ్య 10 బిలియన్‌ డాలర్ల విలువైన 24 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.  చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముంది. రేపు చినా సంస్థల సీఈవోలతో మోదీ సమావేశం కానున్నారు. బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రాంతీయ నేతల వేదికలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రాలు వివిధ స్థాయిలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి, దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమన్నారు. సమాఖ్య వ్యవస్థలో పరస్పర సహకారం, పోటీ తత్వం ఉండాలన్నారు. వాణిజ్యం, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోదీ పేర్కొన్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా   మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో  భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్‌-చైనా సరిహద్దు వివాదం, ఇరుదేశాల మధ్య వ్యాపార,వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. భారత్‌ – చైనా సరిహద్దులో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.  చైనాలో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. చైనాతో సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. చైనాతో ఆర్థిక సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని చెప్పారు. ద్వైపాక్షిక సహకారంపై ప్రధానంగా చర్చించామని స్పష్టం చేశారు. వీసా విధానం, సరిహద్దులో నదుల అంశాలపై చర్చించామని వెల్లడించారు. సమాఖ్య వ్యవస్థలో పరస్పర సహకారం, అభివృద్ధిలో పోటీతత్వం ఉండాలన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. చైనా పర్యటనలో భాగంగా చినా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందని, వారు చేసిన మర్యాదలు వారి అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా మోదీ గుజరాత్‌ దేవ్‌నిమోరిలోని మూడు, నాల్గవ శతాబ్దం నాటి బుద్ధుని స్తూపాన్ని, వాద్నాగర్‌లోని పురాతన చారిత్రక చిత్రాలను బహుకరించారు.