సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించిన యూపి సిఎం యోగి

గాంధీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నర్మద నదిపై నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించారు. పటేల్‌ విగ్రహం విశిష్టతను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పర్యాటకులకోసం ఏర్పాటు చేసిన పార్కులో కొద్దిసేపు కలియదిరిగారు. యోగి వెంట గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణి కూడా ఉన్నారు. ఇంతటి భారీ విగ్రహం ఏర్పాటు చేయడం అద్భుతమని అన్నారు. పటేల్‌కు నిజమైన స్థనాం దక్కిందన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పటేల్‌ సేవలు మరువలేనివన్నారు. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మహా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల 31న ఆవిష్కరించారు. గుజరాత్‌ రాష్ట్రంలో కేవడియాలో 182 విూటర్ల ఎత్తైన పటేల్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ విగ్రహం. విగ్రహం ఛాతి వరకు వెళ్లి సందర్శకులు చూసేలా రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. దాదాపు 157 విూటర్ల ఎత్తు వరకు సందర్శకులు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. ఈంతో ఇక్కడ పర్యాకటంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి.