సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హన్మపూర్ గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి..


యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
భువనగిరి మండలం హన్మపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ,పంజాల జైహింద్ గౌడ్ రామాంజనేయ గౌడ్ ,కుడుకుల నగేష్ ,సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘం భావాన్ని ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి. మరియు ఈ కార్యక్రమంలో నిర్వహించిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… 1650 ఆగస్టు 18 న ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథ పాలెం మండలం ఖిలాషా పూర్ గ్రామంలో నాసగోని ధర్మన్న గౌడ్ , సర్వమ్మ దంపతులకు జన్మించాడు అని చిన్నప్పుడే తండ్రి మరణించడం తో తల్లి పెంపకం లో గరాబంగా పెరిగాడాని తల్లి కోరిక మేరకు కులవృత్తిని చేపట్టి కల్లు గిసేవడని కులవృత్తి చేస్తూనే అప్పటి ముస్లిం నవాబుల దరాగతాలను ఎండగడుతూ గెరిల్లా సైన్యాన్ని ఏర్పరచుకొని వారిపై తిరుగుబాటు చేసి మొగలు సైన్యాన్ని గడ గడ లాడించిన వీరుడని ముస్లిం రాజైన ఔరంగజేబు ని ఓడించి ఎన్నో దుర్గాలను నిర్మించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాలను ఎగురవేయాలని నిర్ణయించి గెరిల్లా సైన్యం తో మొగలులపై దడెత్తి గోల్కొండ కోటను ఆక్రమించి 7 నెలలు గోల్కొండ ను పరిపాలించిన యోధుడని అన్నారు. ఒక్క గౌడ కులస్థులకే కాకుండా బహుజన కులాలన్నింటికి అండగా నిలిచిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని , వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పంజాల జైహింద్ గౌడ్ పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ పంజాల లోకేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్ జెడ్పి ఫోర్ లీడర్ కుడుగుల నగేష్ ,విజయ్ మనోహర్రావు ,శంకర్ గౌడ్, కాలే శ్రీనివాస్, గ్రంథాలయం చైర్మన్ అమరేందర్ గౌడ్ వైస్ ,జడ్పిటిసి బీరు మల్ల ఎంపీపీ నరాల నిర్మల వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి అతికం లక్ష్మీనారాయణ గౌడ్ , ఓం ప్రకాష్ గౌడ్ ,యూత్ నాయకులు జడల యషీల్ గౌడ్ .రంగ కొండల్ గౌడ్ ,ఉప సర్పంచ్ ఆముదాల రమేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.