సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం
కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను
బలోపేతం చేయడమంటే ఇదేనా అని అన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే తెరాస ప్రభుత్వానికి కనువిప్పులు కలిగే విధంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని కటకం అన్నారు.73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్లలెకు నేరుగా ప్రత్యేకంగా నిధులు వచ్చేలా చేస్తే గత అయిదేళ్ల తెరాస ప్రభుత్వం స్థానిక సంస్థలకు నయాపైసా ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు సైతం విద్యుత్తు బిల్లులు తదితర అవసరాలకు దారిమల్లించారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్తులో నిధుల కోసం అన్ని పార్టీల జడ్పీటీసీలు సమావేశాలు బహిష్కరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  ఈ ఎన్నికల్లోనూ సేవాదృక్పథం గల వారినే అభ్యర్థులుగా నిలిపామని నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. ప్రాదేశికంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అధికార పార్టీకి గుణపాఠం కలుగుతుందని అన్నారు.