సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ…
కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి /ఇనుగుర్తి మండల కేంద్రంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పండగ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేయడం హర్షనీయమన్నారు.