సల్మాన్‌కు ఊరట

1

– సెషన్స్‌ కోర్టు శిక్షను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

– బెయిల్‌ కొనసాగిస్తు ఉత్తర్వులు

ముంబై,మే8(జనంసాక్షి):  ముంబై హైకోర్టులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు ఊరట దక్కింది. సెషన్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులో సల్మాన్‌కు ముంబై హైకోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను  కూడా సస్పెండ్‌ చూస్తూ మద్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధిందించి కింది కోర్టులో సరిగా విచారణ జరగలేదని కోర్టు తెలిపింది. శుక్రవారం ఉదయం బాంబే హైకోర్టులో సల్మాన్‌ కేసుపై వాదప్రతివాదనలు జరిగాయి. సల్మాన్‌ తరపున అమిత్‌ దేశాయ్‌ సమర్థంగా వాదనలు వినిపించారు. సల్మాన్‌ ఆనారోగ్య పరిస్థితిని, అతను చేసిన సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సల్మాన్‌కు శిక్షను నిర్ధారించడంతో రవీంద్రపాటిల్‌ సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని అది సరికాదని వాదించారు. కారు టైర్‌ బరస్ట్‌ అయిన సంగతిని కూడా పట్టించుకోలేదని వెల్లడించారు.అమిత్‌ దేశాయ్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌ వాదనలు కూడా ముగిసిన తర్వాత బెయిల్‌ మంజూరు చేశారు. తాజా బెయిల్‌ కోసం కొత్త బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సల్మాన్‌ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. బెయిల్‌ పిటిషన్‌ విచారణ ప్రారంభమైన సమయంలో  సల్మాన్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. సల్మాన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌, సోదరి అల్వీరా కోర్టుకు చేరుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌కు  బెయిల్‌ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న ఉత్కంఠకు తెరపడింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్‌ చేయాలని అమిత్‌ దేశాయి ఈ సందర్భంగా జడ్జిని కోరారు.  ఆ రోజు జరిగింది కేవలం యాక్సిడెంట్‌ మాత్రమే అని, చావుకు కారణమయ్యారనే అభియోగాలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్‌ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.  కాగా ఈ కేసులో నాలుగో వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్‌తో  పాటు కారులో ఉన్న బంధువు కమాల్‌ ఖాన్‌ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదనే అంశాన్ని అమిత్‌ దేశాయి లేవనెత్తారు.  ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులున్నారన్నారు. నలుగురు కూడా ప్రత్యక్ష సాక్షులని, దీనిని కింద కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.  పోలీస్‌ అధికారుల ముందు ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుంచి 100 కిలోవిూరట్ల వేగంగా ప్రయాణించిందని సాక్షి చెబుతున్నారని, అయితే ¬టల్‌ నుంచి ఘటనా స్థలానికి రావటానికి 30 నిమిషాలు పట్టిందని, దూరం 14 కిలోవిూటర్ల మాత్రమే అన్నారు. సల్మాన్‌  ఖానే కారు నడుపుతున్నారని ఎవరూ నిరూపించలేకపోయారని అమిత్‌ దేశాయి వాదనలు వినిపించారు.