సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలు

1

– రెండు రోజుల తాత్కాలిక బైయిల్‌

ముంబై,మే 6 (జనంసాక్షి):  హిట్‌ అంా రన్‌ కేసులో బాలీవుా నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ  సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు పదేళ్ల శిక్ష పడవచ్చన్న  ఉత్కంఠకు తెరపడింది. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష ఖరారు చేస్తున్నట్టు న్యాయమూర్తి  వెల్లడించారు. అంతేకాకుండా రూ.25 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ముంబై సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేaపాండే ఈ మేరకు తీర్పును వెలువరించారు. దాంతో సల్మాన్‌ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ ను ముంబయిలోని ఆర్థం రోడ్డు జైలుకు  తరలించే అవకాశముంది.  బాధితులకు మరింత నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని సెషన్స్‌ కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు  ఐదేళ్లు శిక్షపడటంతో బెయిల్‌  పిటిషన్‌ ను హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పోలీసులు ఆయనను ముంబైలోని ఆర్థం రోా జైలుకు తరలించనున్నారు. సెషన్స్‌ కోర్టు బుధవారం  హిట్‌ అంా రన్‌ కేసులో సల్మాన్‌ను దోషిగా పేర్కొంటూ తుది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో బెయిల్‌ వేస్తామని సల్మాన్‌ తరఫు న్యాయవాది తెలిపారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. హిట్‌ రన్‌ కేసు ఘటనపై సల్మాన్‌తోపాటు అతని డ్రైవంను ముంబై పోలీసులు విచారించగా అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణిస్తున్న కారును నడిపింది తాను కాదని ఆ సమయంలో కారును నడుపుతున్నది తన డ్రైవం అని సల్మాన్‌ వాంగ్మూలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే సల్మాన్‌ఖాన్‌ కృష్ణ జింక వేట కేసును ఎదుర్కొటున్నారు.    ప్రాసిక్యూషన్‌ ఆయనపై మోపిన అన్ని అభియోగాలు రుజువైనట్టు  కోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్‌ ఆయనపై మోపిన సెక్షన్ల ప్రకారం  గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష సల్మాన్‌ ఖాన్‌కు పడవచ్చని భావించారు. . మూడేళ్ల లోపు శిక్ష విధిస్తే తీర్పిచ్చిన కోర్టులోనే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీయింస్త్ర హ్యూమన్‌ పేరుతో సల్మాన్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, దాన్ని చూసి కాస్త శిక్ష తగ్గించాలని సల్మాన్‌ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కాగా  2002 సెప్టెంబం 28 అర్థరాత్రి సల్మాన్‌ బాంద్రాలోని అమెరికన్‌ బేకరీ సవిూపంలో  రోడ్డుపై నిద్రపోతున్న వ్యక్తులపై నుంచి తన వాహనాన్ని పోనిచ్చాడు. ఆ ప్రమాదంలో  ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు బాంద్రా పోలీసులు సల్మాన్‌ను అరెస్టు చేశారు.  సెప్టెంబం 29, 2002లో ఆయనకు బెయిల్‌ మంజూరైంది. నాటి నుంచి ఈ కేసు కోర్టుల చుట్టు తిరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు ముంబైలోని సెషన్స్‌ కోర్టు విధించిన జైలుశిక్షపై తాము ముంబై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు సల్మాన్‌ తరపు న్యాయవాది తెలిపారు.  సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన అనంతరం సల్మాన్‌ తరపు న్యాయవాది మాట్లాడారు.బాలీవుా నటుడు సల్మాన్‌ఖాన్‌కు  బాంబే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. రెండ్రోజుల మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. సెషన్స్‌ కోర్టు తీర్పు ప్రతి అందాక మరోసారి ఈ కేసును హైకోర్టు విచారించనుంది. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో ఉన్నారని అతని తరఫు లాయర్లు హైకోర్టులో పిటిషన్‌ వేయగా కోర్టు పరిశీలించి తాత్కాలికంగా రెండు రోజుల బెయిల్‌ మంజూరు చేసింది. సల్మాన్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని…. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు ప్రముఖ న్యాయవాది హఝీ సాల్వే హైకోర్టుకు విన్నవించారు. దీంతో సల్మాన్‌కు రెండు రోజు పాటు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమై పరారైన కేసులో సల్మాన్‌ఖాన్‌కు ముంబయి సెషన్స్‌ కోర్టు బుధవారం మధ్యాహ్నమే ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అతని తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2002 నాటి హిట్‌ అంా రన్‌ కేసులో సల్మాన్‌ ఖాన్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దాంతో ఆయన్నీ ముంబై ఆర్థం రోడ్డులోని జైలుకు తరలించారు. తాత్కాలిక బెయిల్‌తో సల్మాన్‌ ఖాన్‌ రాత్రికి జైలులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదిలావుంటే  ఈ కేసులో కారు ఢీకొన్న ప్రమాదంలో బాధితులు మాత్రం అతడికి శిక్ష పడడం కంటే.. తమకు పరిహారం అందడమే ముఖ్యమని అంటున్నారు. అబ్దుల్లా రవూఫ్‌ షేచీ ఈ ప్రమాదంలో కాలు కోల్పోయారు. గత 13ఏళ్లుగా తన వద్దకు ఎవ్వరూ రాలేదని, ఏదో పనిచేసుకుంటూ బతుకుతున్నానని, చాలా సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సల్మాన్‌పట్ల తమకు కఠినమైన భావనలేవిూ లేవని.. అతడి సినిమాలు ఇప్పటికీ చూస్తానన్నారు. ఆయనకు శిక్షపడడం కంటే తమకు పరిహారమే ముఖ్యమని షేచీ పేర్కొన్నారు. సల్మాన్‌కు శిక్ష పడడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. నా కాలు తిరిగి రాదు.. నా సమస్యలేవిూ తగ్గవ్ణు అని అబ్దుల్లా షేచీ వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన /పొరుల్లా మెహబూబ్‌ షరీఫ్‌ భార్య మాట్లాడుతూ నష్ట పరిహారంగా డబ్బు కంటే తన కుమారుడికి ఉద్యోగం ఇస్తే తమకు ఆసరాగా ఉంటుందన్నారు.