సల్వీందర్‌కు సంబంధం లేదు
న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి):ఎట్టకేలకు పంజాబ్ సీనియర్ పోలీస్ ఉన్నత అధికారి సల్వీందర్ సింగ్‌పై కొనసాగుతున్న ఉత్కంతకు తెరపడింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిలో అనుమానితుడిగా పేర్కొన్న పంజాబ్ సీనియర్ పోలీస్ ఉన్నత అధికారి సల్వీందర్ సింగ్‌కు ఎన్‌ఐఏ క్లీన్ చిట్ ఇచ్చింది. సల్వీందర్ సింగ్‌కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించిన ఎన్‌ఐఏ ఈ దాడితో ఆయనకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. పదిహేను రోజులుగా ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో అధికారులు సింగ్‌ను విచారించారు. అమృత్‌సర్‌లోని సింగ్ ఇళ్లు, కార్యాలయంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎన్‌ఐఏ వర్గాలు వెళ్లడించాయి. పఠాన్ కోట్‌లో ఉగ్రదాడి తరువాత సల్వీందర్‌ను అనుమానితుడిగా పేర్కొని గత కొన్ని రోజులుగా ఎన్‌ఐఏ విచారిస్తున్న విషయం తెలిసిందే.