సహకార సంఘాల్లోనే విత్తనాల తయారీ
ఖమ్మం, అక్టోబర్ 8 : ఇక నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వరి విత్తనాలు తయారు చేసి, రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా సహకార శాఖ నిర్ణయించింది. విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇది అసరాగా ఉండేందుకు అమలు చేయాలని భావిస్తున్నమని అన్నారు. జిల్లాలో ఇది విజయవంతంగా నడుస్తున్న 17 సంఘాలను విత్తన తయారీకి ఎంపిక చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతమైతే దశల వారీగా విత్తన తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచలనలో సహకార శాఖ ఉంది.