సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్లను పరిష్కరించాలి
భీమ్ గల్, ఏప్రిల్ 30, (జనంసాక్షి) : మండలములోని ఆయ గ్రామాల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్లను రాష్ర్ట ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ కోఆర్డినేటర్లు ఒక్క రోజు దీక్ష చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ లింగం కు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్ లో ఉన్న వేతణాలు వెంటనే చెల్లించాలన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.