సాగర్ నీటి విడుదలపె స్పష్టత ఇవ్వాలి
కూసుమంచి: సాగర్‌నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సత్తుపల్లి శాసన సభ్యుఢు సంద్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచిలొ శనివారం అయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పోతిరెడ్డిపాడు సాగర్ డెల్టాలకు నీటి విడుదల విషయంలో మాట్లాడారు పోతిరెడ్డిపాడు సాగర్ డెల్టాలకు నీటి విషయంలో అత్యుత్సాహంగా ఉన్న ప్రభుత్వం సాగర్ అయకట్టు రైతులు విషయంలో పట్టనట్టు వ్యవహిరిస్తోందని విమర్శించారు సాగర్‌నీటి విడుదల విషయంలో ఏకాభిప్రాయ సాధనకొసం అఖిలఫక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఖమ్మం జిల్లా అయకట్టుకు నీరు ఇవ్వని పక్షంలో తెదెపా అధ్వర్యంలో అందోలన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.