సాగర్ సందర్శించిన ముఖ్యమంత్రి సలహాదారులు ఏకే ఖాన్

నాగార్జునసాగర్ (నందికొండ), జనం సాక్షి,(ఆగస్టు 21); అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ను ఆదివారం నాడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు ఏకే ఖాన్ కుటుంబ సమేతంగా సందర్శించారు.నాగార్జున సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి స్థానిక ప్రోటోకాల్ విభాగం డిప్యూటీ తాసిల్దార్ శరత్ చంద్ర, స్థానిక ఎస్సై రాంబాబు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్,ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. తదనంతరం తెలంగాణ టూరిజం లాంఛీలో నాగార్జున కొండ ను చేరుకొని అక్కడ పురావస్తు మ్యూజియంని సందర్శించిన అనంతరం పునర్నిర్మించిన మహా స్తూపము,సింహాల విహారం సందర్శించారు. బుద్ధవనం ప్రాజెక్టులో బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధ చరిత వనం,స్తూప వనాన్ని మహాస్తూపాన్ని ఎంతో ఆసక్తిగా సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతమైన కట్టడం అని బుద్ధుని జీవితం అణువు అణువు ఇక్కడ తీర్చిదిద్దారు అన్నారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటి మహా అద్భుత కట్టడాన్ని నిర్మించడం గర్వించదగిన విషయం అని అన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ నాగార్జున సాగర్, నాగార్జున కొండ,బుద్ధ వనం ప్రాజెక్టు విశేషాలను వివరించారు.