సాగునీరు అందించే కెనాల్ మూసివేశారు..

అధికారులు స్పందించి న్యాయంచేయాలి..
కాలువ పోతుందని తెలిసి స్థలం కొని ఇప్పుడు మూసివేశారు..
మందపల్లి రైతుల ఆవేదన..
ఫోటో ; పూడ్చి వేసిన కాలువ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు..
సిద్దిపేట అర్బన్, జూన్ 22( జనం సాక్షి):
పంటలకు సాగునీరు అందించే కెనాల్ కాలువ ను తమ సొంత స్థలంలో ఉందంటూ కొంతమంది వ్యక్తులు మూసి వేయడం పట్ల మందపల్లి రైతులు బుధవారం మూసివేసిన చోట ఆందోళన చేపట్టారు. రంగనాయక సాగర్ నుంచి సాగునీరు వెళ్లడానికి గొలుసుకట్టు చెరువులకు కెనాల్  కాలువ నిర్మించారు. మంత్రి హరీష్ రావు కు విన్నవించుకుని మంత్రి చొరవతోనే మూడు సంవత్సరాల క్రితమే ఈ కాల్వను అధికారులు ఏర్పాటు చేసినట్లు రైతులు తెలిపారు. కాలువ వలన 4 గొలుసుకట్టు చెరువులు నిండి సుమారు రెండు వందల ఎకరాలకు సాగునీరు అందుతునట్లు రైతులు వివరించారు. మందపల్లి కి చెందిన వ్యక్తి స్థలాన్ని మరో వ్యక్తి కొనుగోలు చేసి తమ స్థలంలో కాలువ ఉందంటూ అక్రమంగా పూడ్చి వేశారని రైతులు ఆరోపించారు. అ స్థలం  కాలువ పోతుందని తెలిసే అక్కడి స్థలం కొని మూడు సంవత్సరాలు ఆగి ఇప్పుడు పూడ్చి వేయడం ఏమిటని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేసి కాలువలు పునరుద్ధరించాలని లేనిచో ఆందోళన చేపడతామని అంటున్నారు.
Attachments area