సాధించుకున్న రాష్టంలో సబ్బండ కులాల వాటా ఎంత
ముస్తాబాద్ అక్టోబర్ 8 జనం సాక్షి
డీఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్
సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత అని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. ఆదివారం రాత్రి ఆవునూరు గూడెం శనివారం పోతుగల్, ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వరాజ్య పాదయాత్ర డి ఎస్ పి జెండా దిమ్మ, శిలాఫలకాన్ని ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన ఆహ్వాన సభలో ప్రసంగించారు. ఇప్పుడున్నది మన రాజ్యం కాదని ఇది భూస్వాములు ధనవంతులు రెడ్డి, వెలమ దొరల రాజ్యమని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఓట్లు అమ్ముకోకుండా మన ఓటు మన ప్రభుత్వాన్ని సాధించుకుందామని తెలిపారు. కుల సంఘాల నాయకులను సమాజానికి నాయకులుగా మార్చడమే స్వరాజ్య పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అసంఘటిత కార్మికులను సంఘటిత కార్మికులుగా మార్చేందుకే ఈ యాత్ర అని అన్నారు. ఒక దొరను దింపి మరొక దొరను ఎక్కించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక ప్రజలను ఉసిగొలుపుతున్నారని ఆ దొరలందరికి చరమ గీతం పాడి అట్టడుగు వర్గాలకు అధికారాన్ని కట్టబెడతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు కలిసి రండి రాజకీయాలు చేసి మన బాదిత వర్గాలకు సంపూర్ణ న్యాయం చేద్దామన్నారు. గోర్లుకాసేవారు మనుషులను కూడా కాయాలని, గంగపుత్రులు చేపలు పట్టడం కాదు మనుషులను రాజకీయంగా పట్టడం నేర్చుకోవాలని కోరారు. భూమి, సంపద, రాజ్యం కేవలం 10 శాతం లేని రెడ్డి, వెలమ దొరల ఆధీనంలో ఉండడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మందికి ఓటు చైతన్యం, భారత రాజ్యాంగ విలువలు, రాజకీయ విద్య, స్వరాజ్య భావజాల వ్యాప్తి చేసినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి గుండం నరసయ్య ,డి ఎస్ పి రాష్ట్రప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షురాలు భీమ్ కీర్తన, మండల అధ్యక్షులు జిల్లెల మహేష్, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ తిరుపతి, సేవాలాల్ నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపెల్లి శ్రీను, సుంచు మల్లయ్య, వార్డు మెంబెర్ కావటి మైపాల్, తోట ధర్మేందర్, ఈర్ల రాజలింగం, లక్ష్మయ్యగారి బాలయ్య, బీసీ ఎస్సి ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.
Attachments area